Monday 30 November 2015

నా... మాతృభాష!


తెనుగు శిశువు
జననాంతరం మాట్లాడే భాష

ఉగ్గుపాలతో తెనుగు
జతచేసి పెంచిన భాష

తేనెవలె తియ్యదని నేర్పిన భాష

తేటయైనదని కీర్తింపబడిన భాష

ఎందరో
మహానుభావులను తీర్చిదిద్ధిన
నా... మాతృభాష

నేడు
ఆదరణ కరువై
పాతాళానికి తొక్కివేయబడుతోంది

యువతరం కదలాలి
పూర్వవైభవ మాతృభాషఖ్యాతి
నలుదిశలా వ్యాపింపజేయాలి!!

మీ...చింతా! లక్ష్మీ నారాయణ.

Saturday 28 November 2015

"నిశ్శబ్దమేలుతోంది"


కోయిలలా పాడలేక
చిలకలా పలుకలేక
ఒంటరిగా ఉంటూ...

కాళ్లుండి నడవలేక
చెవులుండి వినలేక
పదే పదే మీటనొక్కుతూ...
తనలో తానే నవ్వుకుంటూ...
అరచేతిలో ప్రపంచం
ఉందనుకుంటూ...

నిద్రహారాలు మాని
రేయనకా,పగలనకా..
మరిపిస్తోంది
మనిషన్న నమ్మకాన్ని
వికృత చేష్టలతో
ఎటు వెల్తున్నావో,
ఏంచేస్తున్నావో
తెలిసే మునుపే...
వీరవిహంగం చేస్తోంది
నిలువెల్లా
విషంపూసిన కత్తిలా
అనుబంధాలు
అవమానపడేలా...

మానవత్వాన్ని మరచి
నువ్వనకా, నేనకా..
శ్యాశిస్తోంది
బానిస చేసి ఆత్మను
ఖండిస్తోంది
శిరస్సులను
మృత్యువుని దరికిచేరుస్తూ...
ఇదేంపోయేకాలమో..
ఈ...సృష్టినే
"నిశ్శబ్దమేలుతోంది"
నోరుండి మూగవోయింది
గొంతుకలోంచి మాటరాకుంది
మునివేలుకు మాటలొచ్చాయ్

-మీ...చింతా!  లక్ష్మీ నారాయణ.
21/08/2015 రాత్రి:10 గం.

Wednesday 25 November 2015

"రేపటికై"


ఉదయం
ఉరకలు తీయిస్తూ...
మద్యాహ్నం
మసికల్పిస్తూ...
సాయంత్రం
సేదతీరుస్తూ...
రాతిరికి
హాయి కలిగిస్తూ...
ఎక్కడ ఉదయిస్తావో
ఎక్కడ అస్తమిస్తావో
తెలియదు కానీ
నీకోసం
"రేపటికై" ఎదురుచూస్తూ...
         -ur' Chinta Lakshmi Narayana.


Tuesday 24 November 2015

"చిన్ని పాదం"


పడమటి
సంధ్యా సమయం
అస్తమిస్తున్న తరుణం!

తీరాన్ని తాకిన కెరటం
తలపులలో ఆగిపోతే...

నింగికెగిరిన కెరటం
వలపులలో తేలిపోతే...

గమ్యం చేరే నావ
సుడిగుండంలో
చిక్కుకుపోతే...

జడివానలో
ఉరుములు మెరువులో
పరుగులు తీస్తున్న
"చిన్ని పాదం"
ఇంటికి చేరకపోతే...
ఏమైందనుకోవాలి!!

-మీ...చింతా! లక్ష్మీ నారాయణ.

Friday 20 November 2015

మన రాయల సీమ


రాయల సీమ
రాళ్ళ సీమగా
మరుతూ...

మనుషుల్లో
మమకారం
తగ్గుతూ...

మద్యం
మత్తులో
బంధాలను మరుస్తూ...

చీకటి
సామ్రాజ్యాలను
సృష్టిస్తూ...

రాజకీయ
కుట్రలతో
రణరంగంగా
మారుస్తూ...

రక్తం ఏరులై
పారిన నేల
హరివిల్లు లా
నాట్యం చేస్తూ
కల్లోనైనా కన్పించేనా..?

-మీ...చింతా! లక్ష్మీ నారాయణ.

Wednesday 18 November 2015

"స్పర్శ"


యదలోతుల్లోని
గాయం
నీ..పెదాల
స్పర్శతో...

గుండెలోని
భారం
నీ..పెదాల
స్పర్శతో...

మౌనంలోని
నరకం
నీ..పెదాల
స్పర్శతో...

ఇన్నాళ్ళలోని
యడబాటు
నీ..పెదాల
స్పర్శతో...దూరం అయ్యాయి!

నేడు
ఉషోదయంకు
మన మనసులు ఒకటిగా...

రేపు
నవోదయంకు
మన మనసులు జంటగా...
నీ..పెదాల
స్పర్శతో...ఒకటవ్వాలి!!

         మీ...చింతా! లక్ష్మీ నారాయణ.

"Globalisation"


నాడు
చిమ్మచీకటిలో
కటిక నేలపై
ఆరుబయట
ఏ...క్షణం
ఏమవుతుందో...
ఏ...నిమిషం
ఏమవుతుందో...
భయం గుప్పెట్లో
బ్రతుకుతూ...
నేడు
చిమ్మచీకటిని
వెలుగు పందిరిలా...
ఆరుబయట
ఆదమరిచేలా...
ఏ...క్షణం
ఏం జరుగుతుందో...
ఏ...నిమిషం
ఏం జరుగుతుందో...
కళ్లకు అద్దంపట్టేలా...
ఒక్కో అడుగు
ముందుకు సాగుతూ...
ఒక్కో మెట్టు
పైకి ఎక్కుతూ...
దిన దినం
అనుదినం
అభివృద్ధి చెందుతూ...
అనురాగాల్ని పంచుతూ...
అనుబంధాల్ని కలుపుతూ...
సుదూర తీరాలను
దరికి చేరుస్తూ...
నీ...పయనం సాగిస్తున్నావు!!

- చింతా! లక్ష్మీ నారాయణ.

Friday 13 November 2015

"చుక్క నీరు"

"చుక్కనీరు"
------------

రాలె రెమ్మలాకులు
రా అని పిలిచె
మేఘుడుని

మోడై ఊగె
ఈదురు గాలుల ధాటికి
ఊతంలేక
ఉసురు పోతున్నట్టు

కసిరిగా ఉన్న పండ్లు
ఫలమై పండి
ప్రతిఫలం ఆశించను
కంచై ఎలా
సైనికుడవ్వాలి?

వయసైపోకనే
దరికి ముసలితనం రాకనే?
భూమాతా? నీకూనాకూ
బంధం బధ్ధలవుతుందో ఏమో?

పాపం
ఎక్కడినుండో
ఏరుకోచ్చిన పాచ
ఎక్కడని గూడుకట్టెదానె
పిచుక

నాటినమొక్క
"చుక్క నీరు బొట్లేక"
మండుటెండల్లో
నిలువ నీడలేదాయేనని
కుమిలెనీజీవకుడు!!

-మీ...చింతా! లక్ష్మీ నారాయణ.
 13/11/2015రాత్రి:8గం!!




Thursday 12 November 2015

"మనబతుకులింతేనా"

మనబతుకులింతేనా!

అంతేనా..?
మన బతుకులింతేనా..?
సూర్యుడు దిక్కులు మారినా
ఉషోదయం తూ ర్పునే...

నీ...బుద్ధిమారదా?
ఓటుకు నోటు నినాదంగా మారకనే...

నాడు నువ్వే
నేడు నువ్వే
నాయకున్ని ఎన్నుకోవడం

నీ...ఆలోచన
నీ...నిర్ణయం
ప్రగతిపధంగా సాగాలి

ఒక్కో ఓటు
ఒక్కొక్కరి ఊపిరిగా...
ఒక్కో నోటు
ఒక్కొక్కరి ఉసురుగా గుర్తుంచుకో...
ఓటు నీ...ఆయుధంగా
సంధించు బాణంగా...
దేశ భవిష్యత్తు సమగ్రతకు!!

చింతా! లక్ష్మీ నారాయణ

ప్రాణం ఖరీదు

ఎదురొచ్చే  సుడిగుండం
నడిచొచ్చే నావకైనా తెలుసా?

కన్పించే కన్నులకు 
ఏది సత్యమని? 
ఏది అసత్యమని? తెలుసా? 

దూసుకు వస్తున్న
శరవేగం యమపాశం

పోరు బలిలో విజయం
ప్రాణం ఖరీదు

మనిషిని మనిషి 
వంచించి నమ్మించి 
గొంతుకలు కోయడం
ఎవరికి ఎవరితో సమరం
ఏ రాజ్యం చేజిక్కించుకోడానికి 
బ్రతకడానికి బ్రతికించడానికి
ప్రాణమనేది ఒంట్లో ఉండాలిగా!?
     

-మీ...చింతా లక్ష్మీ నారాయణ.