Sunday 13 December 2015

నాన్నా

నాన్నా
ఈ విశ్వంలో
నే.. కనులు తెరిచేలా...
నే.. శ్వాస తీసుకునేలా...
నే.. పాదం మోపేలా...

నాన్నా
నేనంటూ...
ఒకడిని ఉన్నానంటే
నీ..చలవే...

నాన్నా
నేనంటూ
ఇంతలా అయ్యానంటే
నీ..చలవే...

నీ..పితృణం
ఎన్ని జన్మలు
నీ..పుత్రుడుగా
జన్మించినా
తీర్చుకోగలనా...
నాన్నా!!

-మీ...చింతా! లక్ష్మీనారాయణ.