Wednesday 30 November 2016

నా...నెచ్చెలి!


నీ...చిరునవ్వు కోసం
ఎదురుచూస్తున్నా...
నే...పెదవినై!

నీ...ఊసు కోసం
ఎదురుచూస్తున్నా...
నే...ఊహనై!

నీ...స్వప్నం కోసం
ఎదురుచూస్తున్నా...
నే..నిదురనై!

నీ...కోసమై వస్తున్నా
నే..నీ..నీడనై

నీ...ప్రేమను పంచుతావని
వేకువకోసం ఎదురుచూస్తున్న
ఉదయకిరణంలా నే...నీకోసం
ఎదురుచూస్తున్నా...

            -చింతా.లక్ష్మీనారాయణ(2004)

నీ...కోసం!




మనసుని కాదని చెప్పే
మౌనం ఏదైనా ఉందా..?
ప్రేమని లేదని చెప్పే
మనసు ఏదైనా ఉందా..?

కన్నీళ్ళు పొంగించే బాధేదైనా...
సంతోషంగా స్వీకరించనా నీకోసం!
లో..లో... పొంగే ప్రేమైనా...
దాచేయనా నీ..ఆనందం కోసం!

ఇన్నాళ్ళూ నువ్వూ నేనూ ఒకటనుకున్నా
ఈ క్షణంమే నే..ఒంటరైపోతున్నా
కొన్నాళ్ళ నీ..తోడు నా..సొంతమనుకున్నా
ఈ సమయం నీ..నీడే అందకపోతున్నా.......

       -చింతాలక్ష్మీనారాయణ(2008).

Wednesday 26 October 2016

#ప్రకృతివిదవయ్యె#


ఎటుపోతుందో...
ఏమయిపోతోందో...
దినదినాభివృద్ధితో...
సంస్కృతి
సంప్రదాయం
కట్టుబాట్లు
ఆచారాలలవాట్లు!

ఎటుపోతుందో...
ఏమయిపోతోందో...
దినదినాభివృద్ధితో...
బాష మారే
వేషం మారే
తిండి మారే
శ్రమ మారే
ప్రేమాప్యాయతలు మారే !

ఎటుపోతుందో...
ఏమయిపోతోందో...
దినదినాభివృద్ధితో...
ఎక్కడ కట్టెలపొయ్యి
ఎక్కడ రాగిముద్ద
ఎక్కడ మంచెంబు
ఎక్కడ కోరమీసం
ఎక్కడ పంచకట్టు!

ఎటుపోతుందో...
ఏమయిపోతోందో...
దినదినాభివృద్ధితో...
కొండలు చదునయ్యె
మైదానం తూ ట్లమయం
గుడిసెలు పోయె
పచ్చని చెట్లు మోడువారె
ప్రకృతి విదవయ్యె
చెలిమిలో నీరు ఇంకిపాయె
ఏరులు కనుమరుగాయె!!

        - కుంచె చింతాలక్ష్మీనారాయణ.
                        9908830477.
                     

Wednesday 27 April 2016

ఆశ్చర్యపోతున్నావెందుకు??

సూర్యుడు తూ రుపునే
ఉదయిస్తున్నాడని ఆశ్చర్యపోయావా?
అమవాస్యన చీకటి
పున్నమున వెలుగెందుకొస్తుందని ఆశ్చర్యపోయావా?
చంటోడు టీలమ్ముతున్నాడు
వెట్టిచాకిరిచేస్తున్నాడని ఆశ్చర్యపోయావా?
ముసలోల్లు ఎందుకు
అడుక్కుంటున్నారని ఆశ్చర్యపోయావా?
ఋతువులు ఒకదాని తరువాత ఒకటి
వస్తున్నాయని ఆశ్చర్యపోయావా?
సకాలంలో వాటి పని అవి
చేశాయా లేదా అని ఆశ్చర్యపోయావా?
పాలిచ్చిన ఆవులు
కటికోని సంతకెందుకెలుతున్నాయని ఆశ్చర్యపోయావా?
చెట్టెందుకు ఆకరాల్చి
మోడుబారిపోతుందని  ఆశ్చర్యపోయావా?
ఎండలు ఎందుకు
ముదిరిపోయాయని ఆశ్చర్యపోయావా?
మరి ఈ దినమెందుకు
రోడ్లపై ఆమ్లెట్లేసి ఆశ్చర్యపోతున్నావెందుకు??
ఒక మొక్కైనా నాటావా??
నీరైనా పోసావా??
దాని పండైనా తిని ఆశ్చర్యపోయావా??

 ---------------------#కుంచె#

Monday 25 April 2016

#కొత్తదనం#


మోడుబారి తొడిగిన చిగురులో
నిన్ను చూసుకోవడం

గడ్డిపోచపైన మంచు బిందువులో
నీరూపు గీసుకోవడం

నీలాలగగనంలో శ్వేతవర్ణముతో
పిచ్చిగీతలు గీచేస్తుంటాను

తీరంలో మనం వేసిన అడుగుల
గుర్తులు వెతుక్కోవడం
చెరిపిన అలలను చూడకుండా...
 
మళ్లీ మళ్లీ అదే దారిలో
తేనెటీగలా నడుస్తూపోతున్నా...

పదే పదే తడుముతున్నా
గులాబీ రేకుల నునుపు
నీ మోముపై విరభూసిందని

నాలో నువ్వు అనునిత్యం
ఏదో ఓ అనుభూతి కోసం
వెతుకుతుంటావ్

నీలో నేను కలసిపోయి
నీలా ఆలోచిస్తూ
నీజతగా నడుస్తున్నా
నీలో నాలో కోత్తదనం
పరిమళించాలని!!

                    #KuNcHe#

"నాకు దూరమైన నువ్వు"

నాకు దూరమైన నువ్వు
నీకు దూరమైన నేను
చేరో దిక్కులో
ఎందాకని పయనం
తెగిన గాలిపటంలా
ఎందాకని ఎగరటం
తీరం తాకి వెళ్లిన అల
మళ్లీ తీరానికి రాకమానునా?

                     #కుంచె#
వెన్నెల్లో నక్షత్రాలను ఏరమన్నావ్
నీ ప్రేమను పొందడానికి!

సంద్రంలోని నీటిని కొలవమన్నావ్
నీ ప్రేమలలోతు తెలుసుకోడానికి!

ఆకాశమంత ఎత్తు ఎదగాలన్నావ్
నీ ప్రేమనందుకోవడం తేలికకాదనడానికి!

వాయుపుత్రుడయ్యుండాలన్నావ్
నీ ప్రేమను సప్తసముద్రాలకు పరిచయంచేయడానికి!

                             #కుంచె#

Saturday 13 February 2016

"ప్రేమయ్యా♡"

నీతోనే
నేనంటూ... 
నీతోనే
నానీడంటూ...
నువ్వన్న ఊసులు
రెప్పల ఒడిలో ఒదిగిన
కనుపాపలా... 

నువ్వే 
శ్వాసవంటూ...
నువ్వే 
ధ్యాసవంటూ...
నువ్వన్న బాసలు
తొలిపొద్దులో మెరిసే
సింధూరంలా...

వెన్నలకాసే పూదోటలో
నీప్రేమామృతం కోసం
జుంటీగనవుతా...

నీ హృదయ స్పందనై
నినుతడుతూ...
నీ మేనుకు వస్త్రమై
నీకౌగిలినవుతూ...

ఇద్దరుగా.. 
ఒకటయ్యాం!
ఒకటిగా..
ప్రేమయ్యా♡!!

Sunday 31 January 2016

"నా..తో..."

రోజూ ప్రతిరోజూ
వస్తూనే ఉంటుంది
నే..ఔనన్నా
నే..కాదన్నా
అమ్మప్రేమ
నా..తో...

రోజూ ప్రతిరోజూ
వస్తూనే ఉంటుంది
నే..ఔనన్నా
నే..కాదన్నా
సూర్యకాంతి
నా..తో...

రోజూ ప్రతిరోజూ
వస్తూనే ఉంటుంది
నే..ఔనన్నా
నే..కాదన్నా
చల్లనిపైరగాలి
నా..తో...

రోజూ ప్రతిరోజూ
వస్తూనే ఉంటుంది
నే..ఔనన్నా
నే..కాదన్నా
నా..నీడ  
నా..తో...

రోజూ ప్రతిరోజూ
వస్తూనే ఉంటుంది
నే..ఔనన్నా
నే..కాదన్నా
నను నడిపే నాన్న ప్రేమ
నా..తో...

ఏమీ ఆశించకుండా...
నా..తో వస్తున్న మీకు
పాదాభివందనాలు!!

        -మీ...చింతా! లక్ష్మీ నారాయణ. 
                         31/01/2016.

Friday 29 January 2016

🌄పొద్దు పొడిచే సూరీడు🌄

అవమానాలెన్నో అనుభవించి
అంతకుఅంతై వటుడింతై ఎదిగి
అనురాగాలెన్నో పంచి
అదృశ్యమై వెతుక్కోమంటివి తల్లిప్రేమకు
అనుబంధానాడుల్లో ఇంకిపోతివి
మరువని జ్ఞాపకంగా..
మాయని గాయంగా...
ఎరుపెక్కిన అగ్నిజ్వాలల
అనిర్ధేశావేశమార్గంలో...
నిమడలేని వ్యక్తిత్వం
పోరాడాలేని అస్థిత్వం
బాసట కోరింది
పూలకుత్తుకలు బిగియించే
మరో పత్తి పువ్వుకై...
నింగికెగిరిన కెరటం
నేలరాలిన తార
విషంచిమ్మిన కోరల్లో..
వింత ధోరణుల సమాజంలో...
నలిగిపోతున్న బ్రతకులు
చిధ్రమవుతున్న జీవితాలు
అస్తమించిన కిరణం
"పొద్దు పొడిచే సూరీడు"
చితిమంటల్లో కాలే కమురు వాసనైంది!!

  -మీ...చింతా! లక్ష్మీనారాయణ.
                 28/01/2016.